నాగులచవితి
నాగులచవితి
నాగులచవితి
(తేటగీతి మాలిక )
నాగుల చవితి దినమున నమతు లిడుచు
పరుగు పరుగున జేరిరి పడుతు లెల్ల
పుట్టలో పాలు పోయిచు పూజచేసి
పుణ్య మెంతయో పొందుచు మురిసిరపుడు.
పెళ్లి పేరంటముల్ చేయు పెద్దయనుచు
బిడ్డలన్ గోరి పడుతులు ప్రీతి మీర
చలిమిడిన్ బెట్టి మ్రొక్కుచు స్వామికపుడు
హారతుల నిడి నిల్చిరి యాదమరచి.
తరతరములు గాచెడి దైవమనుచు
సిరుల నొసగుచు లోకుల చింతతీర్చి
జ్ఞానమూర్తియై నిల్చుచున్ జగతి నెపుడు
మోయుచుండెడి శేషుండు ముక్తిదాత //
