STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

తొలిపూజ

తొలిపూజ

1 min
227

తొలిపూజ//


మత్తేభము//


కరుణాసాంద్రుడు పార్వతీ సుతుడు విఘ్నాధీశుడీప్రొద్దులో 

ధరకేతెంచెను బూజలందుకొని మోదంబీయ భక్తాళికిన్

బఱుగుల్ బెట్టుచు రండి!పుష్పములతో పాదంబులన్ గొల్తుమే

వరముల్ గుప్పుచుతీర్చు కామనలు సౌభాగ్యంబులన్ జల్లుచున్ //


మత్తేభము //


మదిలో దల్చిన చాలు ధైర్యమిడు ధీమంతుండు మా వేలుపై 

పదిలంబొప్పగ గాచుచుండి యఘముల్ బాపున్ గటాక్షంబుతో

చదువుల్ నేర్పెడి యొజ్జగన్ నిలిచి

సుజ్ఞానంబు మాకీయగన్ 

హృదయాధీశు గణేశునిన్ గొలిచెదన్ హ్రీంకార రూపాత్మకున్//


చంపకమాల //


తొలితొలి పూజలన్ గొనుచు తోరపు బుద్ధి నొసంగు దేవుడై 

బిలిచిన దర్శనంబునిడి ప్రీతిగ గాంచు వినాయకుండు మా

కలమున నిల్చి యుండి ఘనకావ్యము లన్నియు వ్రాయుచున్ సదా

జిలుకుచునుండు హాసమును సింధుర వర్ణుడు జిల్గుదేఱుచున్ /



చంపకమాల //


కుడుములు రవ్వలడ్లు,పలు కూరలు దండిగ భక్ష్యభోజ్యముల్

వడలును,పూసకజ్జములు,బజ్జిలు పున్గులు పూర్ణపుండలన్

గడివెడుపాలు, నెయ్యి, దధి, కాల్చిన నప్పడముల్ పసందుగన్

 వడివడి జేసి పెట్టితిమి భార్గవి పుత్రుని మ్రోల శ్రద్ధగన్ //


Rate this content
Log in

Similar telugu poem from Classics