దివ్యతేజ!
దివ్యతేజ!
చంపకమాల.
నరకుని సంహరించనట నాతిని తోడ్కొని విక్రమించి యీ
ధరణిని గావగన్ జనులు తద్దయు వేడ్కగ బెట్టి దీపముల్
మురియుచు నిన్ను దల్చి తమ మ్రొక్కులు తీర్చగ భక్తిగన్ వెసన్
గరుణను జూపువాడ!నను గాంచవె నిత్యము ప్రీతిగన్ హరీ!//
చంపకమాల.
తిమిరపు భూతమున్ దఱిమి తీర్చగ భక్తుల కష్టనష్టముల్
కమలను దోడ్కొనీ భువికి గ్రక్కున రావయ!దివ్యతేజ!మా
భ్రమలను కాల్చువాడ!బహు బాధలఁ గ్రుంగెడి యీ జనంబుపై
మమతను జూపరావ!!పరమాత్మ!దయాకర!పాహి!శ్రీహరీ!//
