STORYMIRROR

Midhun babu

Classics Thriller Others

3  

Midhun babu

Classics Thriller Others

కనులముందు

కనులముందు

1 min
4

నా నచ్చని తనమేదో..వేదిస్తూ ఉంది..! 

కనులముందు ప్రపంచమే..బాధిస్తూ ఉంది..! 


ఎవరికేమి చెప్పగలను..అవివేకమె యౌను.. 

మాయ లోయలో లోకం..విహరిస్తూ ఉంది..! 


దొంగదెబ్బ తీస్తున్నది..ఎవరు ఎవరిపైన.. 

సరిహద్దుల రక్షణే అఘోరిస్తూ ఉంది..! 


నాటకమిది ఇంతేనని..గుర్తించుట ఎట్లు.. 

శాంతిసింహమే ఇపుడు..గర్జిస్తూ ఉంది..! 


తప్పెవరిది అనే ప్రశ్న..అర్థరహితమేగ.. 

ఒక తప్పని యుద్ధభేరి..వినిపిస్తూ ఉంది.


Rate this content
Log in

Similar telugu poem from Classics