పొరుగు తున్నాయి
పొరుగు తున్నాయి
ఎక్కడో తారలు కొన్ని దివి పైకి రాలి పడ్డాయి...
కొన్ని ఇంకా మెరుస్తూనే ఉన్నాయి...
కానీ మెరుస్తున్నాయని చుట్టూ ఉన్నవి మొరుగుతున్నాయి....
రాళ్లు రువ్వుతున్నాయి...
దుర్భాషలు చేస్తున్నాయి...
పొమ్మంటున్నాయి...
అందరిలోనూ కలుపుకోలేక...
అరుపులకు భయపడి,
మాటలకు జడుసుకొని,
వెళ్ళిపోతే...
ఆ తారల నైజం మారిపోతుందా?
మారిపోతే ఆ తార ఉనికినే కోల్పోతుంది...
అలా ఉనికిని కొల్పేయే తారల జీవితం...
ఎందుకు?
అందుకే తారలా మెరుస్తూనే ఉండాలి...
వెలుగును పంచుతూనే ఉండాలి..
