STORYMIRROR

Midhun babu

Classics Thriller

3  

Midhun babu

Classics Thriller

అద్ధమేది

అద్ధమేది

1 min
10


అగ్నివీణ మీటుతున్న ..మౌనాలకు అద్దమేది..?!

అందాలను సాకుతున్న..స్వర్ణాలకు అద్దమేది..?!


ప్రశ్నలతో వేగిపోవు..మనసుమాట వినవెందుకు..?!

కలహంసల స్వప్నసీమ..చిత్రాలకు అద్దమేది..?!


పట్టి నిలుపు తత్వమేదొ..పరవశాల సాక్షి కదా..!

చెక్కిలింట జారుతున్న..రాగాలకు అద్దమేది..?!


అక్షరాల పూలతోట..హద్దులేల రద్దగునట..!? 

చెలిమివేణు రవములలో..నాట్యాలకు అద్దమేది..?!


కదలుతున్న కాంతి రథం..ఏ దిశగా సాగేనో..!?

అనుభవాల సాక్ష్యమైన..పవనాలకు అద్దమేది..?!


Rate this content
Log in

Similar telugu poem from Classics