STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Fantasy Thriller

3  

Thorlapati Raju(రాజ్)

Tragedy Fantasy Thriller

150..kmph

150..kmph

1 min
273


బైక్ అయినా...

బైస్కిల్..అయినా

కార్ అయినా...

బస్ అయినా...


అందరికన్నా..

ముందు వెళ్ళాలి!

అంత్యంత...

వేగంగా వెళ్ళాలి!

అందరూ..

చూస్తుండగా వెళ్ళాలి!


రహదారి ఖాళీగా ఉండాలే గానీ!

బైక్... రయ్ రయ్..అంటుంది!

మత్తులో ఉండాలే గానీ!

మనసు దేనికైనా.. సై.. సై..అంటుంది!


ఎన్ని ప్రమాదాలు కళ్ళెదురుగా చూస్తున్నా..

బుద్ధి నయ్... నయ్...అంటుంది!

పెద్దలెవరైనా..సలహా ఇస్తే

నోరు.. ముయ్...ముయ్...అంటుంది!


ఎక్కడ చూసినా..

వేగం...వేగం..!

నేటి యువతకు.. అదే..వేదం!


వేదం కూడా ఒకటే చెప్తోంది..

'అతి' ..ఏదైనా...ఖేదం..ఖేదం!


ప్రాణం ముందు..

నీ వేగం..నీ వేషం..

వెంట్రుక తో...సమానం


అందుకే...

అదుపులేని...వేగం

నీకే కాదు..

ఇతరుల కుటుంబానికి కూడా..

మిగులుస్తుంది....అగాధం!


      .....రాజ్......


Rate this content
Log in

Similar telugu poem from Tragedy