Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

# Suryakiran #

Thriller

4.5  

# Suryakiran #

Thriller

నీ కౌగిలిలో ..!

నీ కౌగిలిలో ..!

1 min
475



కొమ్మమీది పువ్వుల్లో నీవు ,


గోడమీది బొమ్మల్లో నీవు .


కలల్లో నీవు , తలపుల అలల్లో నీవు .


ఎన్నాళ్ళో ఈ విరహం .


రోజురోజుకు నాలో


పెరుగుతూ తీరని వలపుదాహం .



నీ గుండెలో సందడి చేస్తూ నేను ,


మండే సూర్యుడిలో నేను .


నీ మనసును దోచిన చంద్రుడిలా నేను ,


నీదైన లోకానికి ఇంద్రుడిలా నేను .



ఎండల్లో వేడిమినై


కావలసిన శక్తిని ఇచ్చేలా నీ కౌగిలిలో నేను .


ఆ వేళ నిను చేరే


చల్లని నీరును నేనై నీ దగ్గరగా నేను .



వానల్లో జలధారనై


నిను తడిపే ప్రతి బిందువులో నేను .


గలగలా ప్రవహిస్తూ


నీ అందెల రవళికి శ్రోతగా నేను .



చలికాలం హిమపాతాన్నై


చేతుల్లో జారుతూ అల్లరి చేయిస్తూ నేను .


నీ తెల్లని నవ్వులను


చూసి ఆనందిస్తూ మౌనప్రేక్షకుడిగా నేను .




Rate this content
Log in

Similar telugu poem from Thriller