ఒంటరినైపోయా !
ఒంటరినైపోయా !
ఒంటరినైపోయా ! నే ఒంటరినైపోయా !
నీ ప్రేమకు దూరమై నన్ను నేనే మరచిపోయా .
నిన్ను పిలవాలనిపించినా ,
మాటరాక , ఆ రోజుకోసమే నేను
ఎంతగానో ఎదురుచూస్తున్నా !
ఆనాటి అనుభూతుల్లో
అవనిపై పారే సెలయేరుల గలగలలు ,
వెండితెరపై తారలు పలికే సరిగమలు .
ఒకరినొకరం వీడని మనం
ఎప్పటికీ కలసి ఉంటే ,
ఆ బంధంలోని ఆనందాలు
తలపించును కదా వాడనిపూల అందాలను ,
వెన్నెల్లో
కనులను దోచే నీటి అలల సౌందర్యాలను !
రావా
వసంతంలోని కోయిలవై మరోసారి ,
తేవా
నవ్వులను , ఘల్లుమనేలా , ఓ మనోహరీ !