STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Inspirational Thriller Children

4  

Thorlapati Raju(రాజ్)

Inspirational Thriller Children

August 15 th

August 15 th

1 min
370

ఎవరో ఒకరి ఆకలి తీరుస్తుందని విత్తును నాటే వారు

పరోపకారులైతే..తమ తర్వాతి తరాల స్వేచ్ఛ కోసం

రక్తం చిందించిన సమర యోధులను ఏమనాలి?


ఆత్మ తృప్తి కోసమో..అత్యున్నత శక్తి కోసమో దేవునికై తపస్సు చేసే వారు ఋషులైతే..తమ చుట్టూ ఉన్నవారి బానిస సంకెళ్లను తెంపటానికి

ఘోర తపస్సు చేసిన స్వతంత్ర వీరులను ఏమనాలి?


భత్యం తీసుకొని..తమ ప్రాణాలను సైతం దేశ రక్షణకు అర్పించే వీర జవాన్ లు..దేశ భక్తులు అయితే

జీతం లేకుండా జీవితాల్ని బలి ఇచ్చిన త్యాగమూర్తులను..ఏమనాలి?


యే బానిసత్వం అయినా ఎంత కాలం బరాయిస్తుంది

యే అణిచివేత అయినా ఎన్నాళ్ళు అనుచుకొంటుంది

వందల ఏళ్ల అణిచివేత..వందల ఏళ్ల బానిసత్వం

ఒక్కసారిగా తిరగబడి ఉద్యమిస్తే..ఎన్ని వేల తూటాలు ఆపగలవు?


గుండుకు..గుండెను చూపిన ధీరుడొకడు

రొమ్మును కోసేస్తున్నా దేశభక్తిని వీడని యోధురాలు

మరొకరు


ఇలాంటి ఎంతో మంది రక్తం మనకు బలాన్ని ఇచ్చింది

ఇలాంటి ఎంతో మంది మునివీరుల ప్రాణ త్యాగం

నేడు మనకు స్వేచ్ఛను ఇచ్చింది

ఆ స్వాతంత్ర్య సమరయోధుల సమాధులే..మన స్వేచ్ఛ భారతావనికి పునాదులు

వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం

వారి ఆకాంక్షలను బ్రతికించుట లోనే ఉంది

మన భవితవ్యం!


            ......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Inspirational