STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

ఆరుబయట చలిలో..

ఆరుబయట చలిలో..

1 min
398

అతడు కాళ్లు ముడుచుకుని దగ్గరికి లాక్కున్నాడు

పచ్చి కట్టెలు సరిగ్గా కాలట్లేదు

శీతాకాలపు చల్లగాలి అతడి చెవుల్లో ఏదో చెప్పబోయింది

ప్రియురాలి మీద విసుక్కున్నట్టు అతడు శాలువాతో చెవుల్ని కప్పాడు


అతని కళ్ళజోడు పొగ మంచుతో కప్పబడింది

కనిపించీ కనిపించక అతడు కట్టెలను ఎగదోసాడు

మంటలు పైకి పాకుతున్నాయి

అతని ఒంట్లోని భయంలా

అవి చీకటిని చుట్టుముడుతున్నాయి


వక్షోజాలను హత్తుకుని వెచ్చగా నిదురిస్తున్న వారు

వేడి గాలుల యంత్రాలతో చలిని తగ్గించే వారు

వాస్తవ వార్తల కోసం తిరిగే వారు

ప్రజా సమస్యలను పట్టని వారు


అతడు ఏ కోవలోకీ రాడు

సగం కాలిన శవాల మీద ఎగిరే నిప్పు కణికల్ని ఊదుతూ

చలి కాల్చుకుంటూ 

ఆరుబయట అందరికీ తోడుగా ఉంటాడు

వివిధ రకాల పేర్లతో పిలిపించుకుంటాడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract