దేహంపైప్రేమకావ్యం
దేహంపైప్రేమకావ్యం
ఎన్నో యుద్దాలని చేసిన
మగ మహారాజుల పదునైన
ఖడ్గాలు నా బిగువుల బరువుని
చూసి తలదించుకొన్నాయి
కాని నా పదహారు ప్రాయం ఎక్కువ అనుభవం
గలిగిన నీ మగసిరికి మురిసిపోతుంది
నా కళ్ళు నీ కోసం ఎన్ని రోజులని
స్వప్నాలను కలగనాలని అడుగుతున్నాయి
మళ్ళీ నీ పెదవుల రుచి చూడాలని
నా పెదవులు ఎన్ని రాత్రులు ఎదురుచూడాలి
నా సొగసులు రోజుకోసారి నిన్ను రమ్మంటున్నాయి
ఇన్నాళ్లు నీకోసం నీరీక్షించడం నన్ను శిక్షించడమెగా
మనసు మౌనంగా మాట్లాడుతుంది
మది కోకిలలా పల్లవిలను విన్పిస్తుంది
విరహంలో తనువు విహరిస్తూ విలపిస్తుంది
నీ జ్ఞాపకాలు హృదయంలో పదిలంగా ఉన్నాయి
నువ్వు........
దూరమైతే పూలు ముళ్ళులా గుచ్చుతున్నాయి దరిచేరితే ముళ్ళుకంచె పూలపాన్పులా మారుతది
నీ సాంగ్యత్యంలో నరకం స్వర్గంలా
నీ ఎడబాటుతో స్వర్గం నరకం లాగా
ఏమిటి మాయ.....
నా గాయానికి మందు నీ దగ్గర ఉంది
నా గతాన్ని మరిపించే మత్తు నీతోనే ఉంది
రా ప్రియతమ!
నా దేహపు కాగితం పైన
నీ పెదవులతో ప్రేమ కవితలను
నీ చేతులతో శృంగార కావ్యాలను
నీ తనువుతో చిలిపి ఆటలను
రచించి ప్రచురిద్దాం.

