STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

నీవు నా మనసుకు తీరని దాహానివి

నీవు నా మనసుకు తీరని దాహానివి

1 min
686

నేను ఇష్టపడి, మనసుపడిన వాడివి నీవు

నీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను....

ఎన్ని దారులు, ఎన్ని ఏకాంత వీధులు

ఎన్ని చీకట్లు, ఎన్ని వెన్నెల రాత్రులు

ఎన్ని వేకువ జాములో

ఎన్ని ఎదురు చూపులో..........నీకు తెలుసా


ఎన్ని కలలు కరిగాయో, 

ఎన్ని కోరికలు నలిగాయో

ఎన్ని ఆశలు అవిరయ్యాయో

ఎన్ని ఊహలు మర్చిపోయానో.....నీకు తెలుసా


పున్నమి వెన్నెల కోసం నిశీధి వేచి చూసినట్లు

సాయంకాలం కోసం విరిసే మల్లెలు 

మనసు పారవేసుకున్నట్లు

స్వాతి చినుకుల కోసం 

చకోర పక్షి ఆరాటపడినట్లు

వసంతంలో మావిచివుళ్ళ కోసం 

కోకిల ఆతృత పడ్డట్లు

కడలి అలల కోసం 

సముద్ర తీరం ఎదురుచూసినట్లు

నీవంటే ఇష్టపడి, మనసు పడి, ఆశ పడ్డాను


ఎన్నీ తీయ్యని కలలు కన్నానో ......

గడచిన రాత్రులనడుగు

ఎన్ని ఏకాంత వీధులల్లో......

నా చిరునవ్వులు పరిచానో చూడు

ఎన్ని వెన్నెల రాత్రులల్లో ......

నా వెచ్చని కౌగిల్లు ఎదురుచూసాయో చూడు

ఎన్ని నిర్జన స్థలాల్లో .......

మన ప్రణయ గీతాలు అలపించానో విను

ఎన్ని వేసంగి వేకువ జాములో.......

మన ప్రేమను సుప్రభాతంగా వినిపించానో తెలుసుకో


నీవంటే......

నీవంటే తరలిపోని వసంతానివి

నీవంటే కరిగిపోని మంచు పర్వతానివి

నీవంటే నా అందని ఆశవు

నీవంటే నా మిగిలిన కోరికవు

నీవంటే నా నిజం కానీ స్వప్నానివి

నీవంటే నా మనసుకోక తీరని దాహానివి

నీవంటే నా బతుకుకు 

చీకటిని పడనియ్యని వెలుగువి


అందుకే నీవంటే నాకిష్టం.....

నా ఉహాలల్లో నీ ఊసే లేని క్షణం

నేను శ్వాసను విడిచి మిగిలి ఉన్న 

శవంతో సమానం

అయిన నీవు....

నా ప్రాణాన్ని పోనియ్యని అమృతానివి కాదా!



Rate this content
Log in

Similar telugu poem from Romance