గుమ్మంలో ముద్దుగుమ్మ
గుమ్మంలో ముద్దుగుమ్మ
మా వీధి గుమ్మం ముందర
నా కళ్ళు నీ రాకకై వీక్షిస్తూన్నాయి
చడి చప్పుడు చేయకుండా ఈ రాత్రికి రా !
నాతో నిశ్శబ్ద యుద్ధం చేద్దువుగాని
పువ్వుల మెత్తదనం నీ కాళ్ళను తాకితే
పరిమళం నీ ముక్కుకు సోకుతుంది చూసుకో
మదుపానీయాలు సేవించిన నీకు
మత్తును తొలగించాలని
నేనే మల్లెలు పరిచాను
నీ మాటలతో
నీ చూపులతో
నీ స్పర్శతో
మత్తుగా, గమ్మత్తుగా
ఈ పిల్ల ఒడిలో చల్లగాలిలో
చక్కిలిగింతల సయ్యటలో
నా తలపుల వనంలో తొలిప్రేమ పాఠాన్ని నేర్చుకో
ముద్దులతో ముద్దుల అక్షరాలు దిద్దుకో!
వినడానికి సరళంగా ఉన్న
నన్ను పొందడములో కష్టమే నీకు!
నా వలపు తోటలో విరబూసిన పువ్వులన్ని
నీ దోసిలల్లో నింపుకో
విరగ కాసిన సొగసు కాయల
రుచులను నోటినిండా అందుకోని
నా తొలిప్రాయపు పరువాల ప్రవాహంలో ఈతకొట్టి
నా కురులలో పువ్వుల సువాసనగా పరిమళించు
నా మెడలో వేసుకునే హారంలో కొలువై ఉండు
నా పెదవిపై పుట్టుమచ్చలా అలంకరించు
నా చెవి దిద్దులో నీ వుండి
నా మనసును ఈ మౌనం నుండి విడిపించు
నీవు ఏ దారిలో ప్రయాణించిన
ఎక్కడ వెతికినా చివరికి
నేను నీ గమ్యంగానే మిగులుతున్నాను కదా!
నీ మనసు నన్ను చేరాలని ఆరాటపడుతుంది కదా!
అందుకే......చెబుతున్న.....
కొన్నీ రాత్రులు పండు వెన్నెల వాకిట్లో
మరికొన్ని రాత్రులు చిమ్మ చీకటి గుప్పిట్లో
నీ నులివెచ్చని కౌగిలిలో
నీ దాహం గొన్న నరాలలో
నేను ప్రేమగా ప్రవహించి
ఒకరి తనువులో ఇంకోకరం
కలిసి పోవాలని, కరిగిపోవాలనుంది
రా! ప్రియతమ!
మా వీధి గుమ్మం ముందర
నా కళ్ళు నీ రాకకై వీక్షిస్తూన్నాయి
చడి చప్పుడు చేయకుండా ఈ రాత్రికి రా !
నాతో నిశ్శబ్ద యుద్ధం చేద్దువుగాని

