Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

వెలిగించు !

వెలిగించు !

1 min
458



ఊహలే నిజమై మనల్ని

   నడిపిస్తాయని నీకు తెలుసు .

అందులోని హాయి

   అడగదెన్నడూ మన వయసు .


కోరేది యువతరంలో

   ఉండే ఉల్లాసమే ఎల్లవేళలా !

ప్రేమించుకుందామా అందుకే

   ఎప్పటికీ ఒకరికొకరమై ఇలా ?

అది తరగని గని అని

   అందరూ ఆశ్చర్యంతో అనేలా !


గతజన్మ బంధమో ,

   నేటి తియ్యని సంబంధమో !

మనమధ్య గొప్పగా

   పెనవేసున్నది ఈ అనుబంధం !


నీ పుట్టుక

   మిన్నంటిన ఓ ఇంటి సంబరం .

నాకు బహుమతివైతే

   ఆ ఆనందమూ తాకదా అంబరం !


వెలిగించు నాలో

   ప్రేమదీపం రోజూ జ్వలించేలా .

జన్మజన్మలకూ

   మనమిద్దరం ఒక్కటయ్యేలా !!



Rate this content
Log in