నీ జ్ఞాపకాల నీడలో ..!
నీ జ్ఞాపకాల నీడలో ..!
నేను నేనుగా నాతో ఉండలేకపోతున్నా
నీతో గడిపిన ఆనందక్షణాలనే తలచుకుంటున్నా
రోజూ కళాశాలకు పుస్తకాలతో ప్రయాణం
సరికొత్త లోకానికి తోటివిద్యార్థుల ఆహ్వానం
పాఠం చెబుతూ ఉపన్యాసకుని ప్రశ్నలు
నేనంటే నేనని పోటీపడి చెప్పిన సమాధానాలు
దారిలో అవరోధాలతో తరగతికి హాజరులు
ఆ విషయాల్నే మళ్ళీ చెప్పమన్న సమయాలు
కిటికీల్లోంచి కురిసిన వానకి తడిసిన బల్లలు
ఇళ్ళకు ఆలస్యంగా ఊరిలోని బడిపిల్లలు
విశ్రాంతి వేళల్లో ఆడుతూపాడుతూ మెలిగాం
కబుర్లతో మైమరచిపోతూ సరదాగా గడిపాం
పరీక్షలంటే భయంభయంగా పరిసరాలు
ఫలితాల రాకతో అందరిలో సంభ్రమాశ్చర్యాలు
పైచదువులకని ఎక్కడెక్కడికో స్నేహితులు
హాయ్ హలో అంటూ ముఖచిత్ర పదర్శనలు
మధురోహల్లో పెళ్ళయిన మా బంధువులు
విహారానికివెళ్ళే వారిలో వలపుల తలపులు
నీవేమో నన్ను ఒంటరిగా వదలి సొంతూరుకు
సందేశంకోసం నే అలుపెరగక తెల్లారేవరకు
మన కలయిక ఏ జన్మకో ఎవరికి తెలియును
నేనందుకే నేడే బయల్దేరా నీవుండే చోటుకు
జ్ఞాపకాలను అక్షరాలుగా కూర్చి రాస్తున్నా
ప్రేమకు గుర్తు ఈ కావ్యకన్యకే అని భావిస్తున్నా !
