STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

బస్సు భామా నా కౌగిలికి రామ్మా

బస్సు భామా నా కౌగిలికి రామ్మా

1 min
366


ఆహా! ఏమి చిత్రం....భళారే విచిత్రం....

ఉదయం పూసినా తాజా పువ్వు

నీ ముఖం మీద విరిసిన చిరునవ్వు......

విచ్చుకున్న తామర రేకులు

విప్పారిన నీ కన్నులు.....


ఎర్రగా పండిన దొండపండులా

నా పంటి గాటు కోసం ఎదురు చూస్తున్న నీ పెదవులు...

తేమను నింపుకున్న గులాబీలా

నా తియ్యని ముద్దు కోసం కందిన నీ చెంపలు....

తేనే పట్టులొంచి తేనే జారినట్టుగా

జుర్రున జారుతున్న నీ అధరామృతం ......

నీ మేని విరిసిన విరుపుల పరిమళం

నా మేనిని తాకి నన్ను మత్తులోకి దింపేసింది


నీ ముంగురులు నా నుదురును ముద్దాడుతున్నాయి

నీ కనురెప్పలు నన్ను ప్రేమతో అహ్వనిస్తున్నాయి

నీ చెవిలోలకాలు జాలితో నా చెలిమిని కోరుతున్నాయి

నీ ముక్కు పుడక నాతో పక్కకు తప్పుకోలేనంటుంది

నీ మెడలోని హారం నాపై మనసు పడ్డానంటుంది

నీ చేతి గాజులు నాలో ప్రేమికుడిని తట్టిలేపుతుంటే

నీ భుజ స్పర్శ నా గుండెతో గుసగుసలాడుతుంది

 

ఏమని తెలుసా!

మనం ఒకరి మనసు ఒకరం పంచుకొనటానికి

ఎవరికి ఎవరు ఏమి కాము

ఒకరితో ఒకరికి అవసరం పడేటట్లు చేసి

ఒకరి నొకరిని కలుపటానికి 

పంచభూతాలు, పంచేంద్రియాలు

విశ్వ ప్రయత్నాలు చేస్తూ 

నీకు ఆహ్వనం పంపుతున్నాయి....


ఏమని తెలుసా!

బస్సులోని భామా నా జీవితంలోకి రామ్మా

నీవు ముసుకున్న కళ్ళలోకి 

నేను కలనై తోసుకు రావాలని

నీ మనసులో నేను తీయ్యని రాగంగా మారి

ఈ బస్సు ప్రయాణం భవిషత్తులో 

ఇద్దరి గమ్యం ఒకటి కావాలని కోరుకుంటు...


నీ తోటి ఆగంతక ప్రయాణికుడు.........






Rate this content
Log in

Similar telugu poem from Romance