STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

మధురక్షణాలు

మధురక్షణాలు

1 min
353

మధుర క్షణాలంటే అవ్వారే అనిపించే ...

మళ్ళీమళ్ళీ వస్తే బాగుణ్ణే ... అనిపించే సమయాలు .

అందరికీ ఎప్పుడో ఒకప్పుడు

తమ జీవితంలో కలిగే మరవలేని అనుభవాలు .

అమ్మ చందమామను చూపిస్తూ ,

గోరుముద్దలు తినిపిస్తోంటే తియ్యగా ఉండదా !

నాన్న తన భుజాలమీద మోస్తూ ,

కంటికి రెప్పలా చూస్తోంటే వెచ్చగా తోచదా !

ఎవరూ లేకున్నా , అభిమానించేవారు

అక్కునజేర్చుకుంటే అందులో ఎంత గొప్పదనం .

యూనిఫామ్లో బడిలో అడుగు పెట్టినవేళ

పులకించదా పసితనం .

ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వగా

ఉపాధ్యాయుడు మెచ్చుకోవడంలో విశేషం .

ఇంకొంచెం ఎదిగాక , రయ్ రయ్యంటూ సైకిల్పై

ఊరంతా తిరిగినప్పుడూ చెప్పలేని ఆనందం .

గమ్యాన్ని త్వరగా చేరుతున్నాననిపించే

ఆ పరిణామం ఎప్పటికీ ఉత్సాహభరితం .

విద్యార్థులందరూ అభిమానించి నాయకుడిగా

గెలిపించి తమ నమ్మకాన్ని తెల్పినపుడు ,

పరీక్షల్లో మంచి మార్కుల

సాధనతో విజయఢంకా మ్రోగించినపుడు .

కళాశాలలో ప్రవేశమంటే ఎవరికైనా

యువతరంలో మరచిపోలేని అనుభూతి .

విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో

యోగ్యతాపత్రాన్ని అందించి ఒక మంచి పౌరుణ్ణి

సమాజానికి అందించామనడంలోని నీతి !

వీడ్కోలుసభలో స్నేహామృత వచనాలు

మనోఫలకంపై ముద్రితమవుతుంటే ...

మనసును మెచ్చి సహవిద్యార్థులు ఏకమై

ప్రశంసించి ప్రియరాగాలు పలుకుతుంటే ...

నచ్చిన ఉద్యోగంలో చేరి

విజయశిఖరాలకు చేరువలో ఉన్నామనిపిస్తే ...

పచ్చని పందిరిలో కళ్యాణ వేడుకలో

మూడుముళ్ళ బంధంతో నెచ్చెలి చేయందిస్తే ...

సంతోషం జీవితంలో ముఖ్యభాగమై

మురిపించి మైమరపించిన ప్రతిక్షణం మధురం .



Rate this content
Log in

Similar telugu poem from Thriller