STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

చుక్కల లోకంలో..

చుక్కల లోకంలో..

1 min
372

వ్యోమకేశుడి జడలు విప్ప

అంతరిక్ష అంబుధి అలజడులు సేయ

కృష్ణ బిలముల తొంగి చూసి

జారు తోక చుక్కల ధూళిలో ఆడి


చుక్కల లోకంలో 

బహు చక్కని రూపంలో

నిర్నిద్ర నేత్రాలుగా

స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి

అందులోని అణువులను పరమాణువులను తాకి

కొత్త లోకంలా విస్తరిస్తూ ఉంటుంది


ఒక వైపు నక్షత్రము కృష్ణ బిలమై

మరో ప్రపంచాన్ని కబళించాలని జరుగుతోంది


నిరంతరమూ సృష్టి, వినాశనాల చక్రం 

అక్కడ జరుగుతూ ఉంది

రోదసీ నన్నూ పిలుస్తోంది

అందులోని వింతలు చూసేందుకు

ఓ వింతలా మారేందుకు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract