STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

స్పందనే సందేశం !

స్పందనే సందేశం !

1 min
429

ఈరోజెంతో చల్లగా బాగుందోయ్ .


ఆ హాయినిచ్చేది తానేనని ఆకాశమందోయ్ .


సూర్యుడు మబ్బుల వెనుక దాగున్నాడు .


వరుణుడు వానికి ఈనాడు సెలవన్నాడు .


ఏడాదికి ఒక్కసారే వచ్చేవి ఋతుపవనాలు .


ఏ నిమిషమైనా ఊరించి మురిపించేవి


మనమధ్య చిగురించే మధురభావాలు .


గాలికి తనువును తాకే చినుకుముత్యాలు .


తలపులతో మనసేమో అల్లరినృత్యాలు .



ఈవేళ బృందావనంలో ఆనందంతో


చిందులు వేయగ రావా ?


పులకింతల జడివానలో తడిసి ముద్దై


ఒకరికొకరం దగ్గరయ్యేందుకు చేసే


చూపుల యుద్ధానికి సన్నద్ధమై రావా ?



పూలను , పండ్లను బహుమతిగా


అక్షరమాలికలను ప్రేమగా


స్వీకరించి తరించ వేగిరమే తరలిరావా ?


చరవాణి సందేశమేల , ప్రియా ?


హృదయమే స్పందనను కలిగించును కదా !



Rate this content
Log in

Similar telugu poem from Thriller