Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

సరికొత్తమార్గంలో చేరాలని ..!

సరికొత్తమార్గంలో చేరాలని ..!

1 min
283



స్నేహితుల జాబితాలో నీ పేరును ప్రతిరోజూ

పేజీ తెరవగానే ఆతృతగా చూస్తా .

పేర్చిన చేమంతులలా అందమని తలుస్తా !

అందులోని సరిగమలు అల్లరిచేస్తూ

నా గుండెతలుపును మృదువుగా తట్టినా ,

నాలోని భావుకుణ్ణి మేల్కొలిపినా ,

సెలయేటి సవ్వడులను అలవోకగా నాలో

రమణీయంగా ప్రవహింపజేసినా

నీ అనుమతికోసమే ఎదురుచూస్తున్నా .

నీవు ఈవారంలో చరవాణికి అభిముఖంగా లేవో ,

నా విన్నపం నీకు కనపడలేక సిగ్గుతో దాగున్నదో

ఉత్కంఠనురేపే నామది పొంగే జీవనది ,

క్రికెట్ ఆటలో చివరిబంతులను చూస్తూ

కేరింతలతో సుఖాసీనులైన ప్రేక్షకులగది !

నీవు సహృదయతతో స్వీకరించాక పగలు రేయి

ఈ రంగులలోకంలో నీవో నిండు జాబిలి .

ఇంట్లో అందరికీ చూపించగా లాహిరిలాహిరి .

ఆ నవ్వులోని హాయి ఎంత కనులకు విందో ,

శిల్పంలాంటి రూపురేఖలూ నాకంతే పసందు .

నీ కవితలు హృదయాన్ని స్పృశించే తేనియలు .

కథలు మనసును పరవశింపజేసే మల్లియలు .

కలలో ఘల్లుఘల్లుమనే నీ మువ్వల గలగలలు .

కళ్ళలో నన్నే పలుకరించే గువ్వల కళకళలు .

ప్రేమజ్యోతిని స్వయంగా అందుకోవాలనే

మన అభిలాష త్వరలోనే నిజమౌతోంది చూడు .

రెక్కలు కట్టుకుని వేగంగా వాలాలనే ,

సరికొత్తమార్గంలో ఝుమ్మంటోంది వింత ఈడు .




Rate this content
Log in

Similar telugu poem from Thriller