STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

నిద్రా దేవి

నిద్రా దేవి

1 min
1.3K

ఎత్తైన మెట్ల వరుస పైనుండి ఎవరో తోసినట్టు

మాడుతున్న పెనంలో చెయ్యి పెట్టినట్టు

ఏవేవో కలలు

నిన్నటి కన్నీటి వ్యథల చీకటి రేఖలు


రెక్కలు విప్పబోతున్న సీతాకోకచిలుక గుప్పిట్లో చిక్కినట్లు

పర్వత శిఖరం అందుకునే వేళ తుమ్ము వచ్చినట్లు

నా లక్ష్యాలు అందుకోలేక జారుతున్నట్లు

ఇంకేదో మార్గంలో దిగజారుతున్నట్లు

చెప్పలేక చెబుతున్నట్లు

ఎవరో తిడుతున్నట్టు

గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నట్లు


అంతా నేనే

కానీ ఏదో వెలితి

పాడు కలలు

పగిలిన అద్దాల ముక్కల్లో నా ప్రతిబింబాలు వేల ముక్కలై

నన్ను భయపెడుతూ బాధపెడుతూ


అమ్మా నిద్రా దేవి

జాగ్రత్తగా నన్ను నీ ఒడిలోకి జారనీయి

కాస్త గురక పెట్టుకుంటూ బాగా నిద్రపోనీ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract