Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

నీ హృదయంలో ..!

నీ హృదయంలో ..!

1 min
347


ఏమైందో ఈరోజు నీ గురించే తపిస్తోంది నా మనసు !

చేరువకావని నీవు తెలిసిందేమో బహుశ తనకు .


ఒకరిపైఒకరం ఇలా మనం ఆగ్రహిస్తే ఏమైపోతాం ?

కలవనిచో చేరుటకు బహుదూరమే ప్రేమతీరం .


ఎన్నాళ్ళిలా గడపాలో ఏమో , ఎవరిని ప్రార్థించాలో .

చల్లగాలికి తేలికైన మేఘమే ఎక్కడైనా కరుగు .

బంగారమంటి నీవు మెరిసినప్పుడే ఆనందమగు .

అలక తీరుటకు ఏం చేయగలనో ఎరుక పరచు .

నీ నవ్వుకోసం ఎన్ని యుగాలైనా కృషి చేసెదను .


ప్రేమలో ఉంది జన్మజన్మలకు చాలనిపించే మాధుర్యం .

మరలమరల పుట్టాలనే కోరికే ప్రియా నాకనుదినం .

పారిజాత పుష్పాలను తేగలనా దివినుంచి నీకొరకు ?

ఇంద్రుని ఐరావతం వాహనమయ్యే అవకాశమేదిపుడు ?

రోజాపూలను ఇవ్వగలను ప్రేమను తెలిపేందుకు .

తియ్యగా మాట్లాడగలను మది పరవసించేందుకు .

సంపన్నుడనూ కాగలను విమానంలో తిరిగేందుకు .

చదువుల సరస్వతే మా ఇలవేల్పైనపుడు

సంభవమే కదా ఏం తలచినా ఈ భువియందు !

కరుణించి కురిపించవా ప్రేమవర్షం నాకోసం ?

చల్లని చూపులతో నన్నాకర్షించవా మనదే ఇక ఈలోకం !

ఎదురుచూడవా మరుజన్మకైనా అమితంగా ప్రేమించి .

నీ హృదయంలో నా ప్రతిమను ఉంచి !!

*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Thriller