సుందర స్వప్నం !
సుందర స్వప్నం !


ఒకరోజు నన్ను నేను తెలుసుకునే ఏకాంతం .
నా చుట్టూ ఉండే ప్రకృతి ప్రభావం మీద ఆలోచన
ఆనాడు ప్రత్యేకం .
ముఖ్యంగా నా వయసులో ఉన్న అందమైన
స్నేహితురాండ్రు మదిలో మెదిలి ఆహ్లాదాన్ని
కలిగించేదా దృశ్యం .
లోహపు బొమ్మలు , రాతి శిల్పాలు ప్రాణం పోసుకుని
సీతాకోకచిలుకల్లా తేలిగ్గా తిరుగుతున్న స్వప్నం .
రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వారు
ప్రేమామృతాన్ని పంచుతున్నట్లు అనిపించడం
మరచిపోలేని అనుభవం .
సుందర వనంలో విహరించిన , ఆడుతూపాడుతూ
గడిపిన , కలసిమెలసి విందారగించిన
అనుభూతి మరలమరల నన్నలరించిందంటే వారికి
ఆశ్చర్యం .
*** *** ***