STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

వివక్ష

వివక్ష

1 min
1.6K

మాటల్లో ధ్వనించదు

నిర్ణయాల్లో ఫలిస్తుంది


కళ్ళల్లో కనిపించదు

కన్నీళ్లు తెప్పిస్తుంది


అనుమానం జనించనివ్వదు

అవమానంతో బదులిస్తుంది


నరాలు చిట్లుతున్న భావన

కర్కశంగా విసిరేసిన ఆలోచన


వయసుకు రాని పిందెలా 

వరదకు కొట్టుకువచ్చిన అనాథ శవంలా

విచిత్రమైన అనుభూతి

ఎప్పుడూ దేహీ అనాలా అనే అశక్తత


విరుద్ధ భావజాలాన్ని ఆకళింపు చేసుకుని

స్వగతాన్ని పీక నొక్కేసిన వ్యక్తి మేధస్సుకు

వివక్షతో బతుకు పంచుకున్న నేను

వేయి వందనాలు చేస్తున్నాను.


Rate this content
Log in

Similar telugu poem from Abstract