STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ప్రేమకోసం ..!

ప్రేమకోసం ..!

1 min
388

ఒక ప్రేమించే హృదయానిది ఆ అద్భుతలోకం

అతని అన్వేషణ ఓ మంచి మనసుకోసం

కమ్మని అనుభూతిని సొంతం చేసుకోవాలని

జీవితం ఎన్నటికీ ఆనందంగా సాగాలని

మాటల్లో తొణికిసలాడాలి ప్రేమభావం

నడతలో కనిపించాలి అందరిపట్ల అభిమానం

అందుకు పత్రికల్లో ప్రకటనతో సమాచారం

క్షణాల్లో అన్నిచోట్లకు చేరవేసే అంతర్జాలం

వివరాలు అక్షరాల్లో చాలా అందంగా

చిరునామా చదవగానే ఇట్టే తెలిసిపోయేలా

రోజూ ప్రతిపేజీ సూర్యోదయంతో జనులముందు

ఆసక్తేగా జరిగేవేమిటనే విషయసేకరణ యందు

నమ్మకం ఏపనినైనా కొంతవరకు నడిపించు

ఆపైన సరైన ప్రయత్నం సఫలతను చేకూర్చు

దూరాలనధికమించి మనసులు కలవటమే లక్ష్యం

ఉపాయంతో కావల్సింది అవలీలలుగా సాధ్యం

విఫణిలో డబ్బులతో ఇటువంటివి కొనలేము

నువ్వానువ్వా అని హాస్యస్ఫోరకంగా అడగలేము

ఇలా ఉండగా కొన్నాళ్ళతర్వాత ఆశ్చర్యకరంగా

ఆహ్వానాన్ని ముచ్చటగా అందుకున్న ఓ భామ

వాళ్ళ తలుపుతీయగా ఎదురుగా ముద్దొచ్చేలా

కలలుగన్న , కోరుకున్నరూపంలో ఆ ప్రేమ

నిజంగానే వేసవికాలపు సంధ్యాసమీరంలా !



Rate this content
Log in

Similar telugu poem from Thriller