STORYMIRROR

B. sadhana

Classics Inspirational Thriller

4  

B. sadhana

Classics Inspirational Thriller

ఒక కథ నా నోట

ఒక కథ నా నోట

1 min
173

అనగనగా ఒక రోజు

అనుకోకుండా ఒక క్షణం

ఆ కథకు ఇది అంతమనీ 

 అనుకున్నానే నేను.

ఆ కథకు ఇది అంతమనీ 

 అనుకున్నానే నేను.


ఆ క్షణం ఆనందంగా గడిపాగా

ఆహ్లాదంగా ముందుకు సాగాను

అది అంతము కాదు ఆది అని

తెలుసుకునేలోపే నా అంతము నన్ను చేరేనుగా.


అది ఆది నా అంతం,

నా ఓటమీ నా నోట

 ఈరోజే చెప్తున్నా విను మిత్రమా

అనుకోకుండా ఆనాడు అనుకున్నా 

అంతమని.


తిట్టని తిట్టు, కొట్టని ఆయుధం

 వేయని అపనింద, మోపని భారం

అవమనించని క్షణము, కన్నీరు కార్చని రోజు, కడుపునిండా తిన్న రోజు ఏదీ లేకుండా చేశాను నేను.


కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేసిన నేను ఈనాడు ఇలా మిగిలాను శిలలా

నేను అనుకున్న నా విజయము నా ఓటమై దేపి పొడుస్తుంది ఈ క్షణము.


నేను చూడలేక పోయాను నిజాన్ని

ఈనాడు చూసినా ఏమీ చేయలేని స్థితి.

మౌనాన్ని వినలేని నేను మౌనంగా మిగిలిపోయాను 

నిందలు మోపిన నేను నిందితుడను అయ్యాను.


అనగనగా ఒక రోజు

అనుకోకుండా ఒక క్షణం

ఆ కథకు ఇది అంత మనీ 

 అనుకున్నానే నేను.

© saధना🖌️


Rate this content
Log in

Similar telugu poem from Classics