మౌనం పలికే వేళ...
మౌనం పలికే వేళ...
మౌనం పలికే వేళ,
అలజడి చేయు ఊహలు,
చిట పట చిందులు వేస్తూ,
మైమరిపించే ఆనందం....
సవ్వడి చేసే ఆలోచనలే
గుండెలోతుల్లో నిశ్శబ్దమై పోయే
ఎంతటి బాధైన ,ఎంతటి బరువునైనా
మోసే వరకే గా ,మిగిలి ఉండే వరకే గా.
శాశ్వత లోకంలో ఏదీ శాశ్వతం ,
శాశ్వతం కానీ దాని కోసమే మనం
శాశ్వతంగా దూరమై పోతున్నాము
ఏదో తెలియని ఆకర్షణ మిగిల్చే తీరని బాధ
క్షణం ఆనందం కోసమని
ప్రతిక్షణం బాధని కొనుక్కుని
కన్నీటి బహుమానాలు మిగిలనే
నలువైపులా నలువైపులా...
నిశ్శబ్దమైన వేలల్లోనా,
నిశ్శబ్దమే అలజడి చేసే
మారుమూలలో ఒకే శబ్దం వినిపించే
గెలుపు ఓటమి శాశ్వతం కాదుగా
ఓడిన వాడు ఒకనాడు గెలవక తప్పదుగా
గెలిచినవాడు ఒకనాడు ఓడక తప్పదు
పడినవాడు ఒకనాడు లేవక తప్పదుగా
లేచిన వాడు ఒక నాడు పడక తప్పదు.
అశాశ్వతం అంతటా శాశ్వతం
నీవే శాశ్వతం నీవే
గెలుపైనా ఓటమైన
పడిన లేచిన అది నీవే అది నీదే
మౌనం పలికే వేళ,
అలజడి చేయు ఊహలు
చిటపట చిందులు వేస్తూ
మైమరపించే ఆనందం
కనురెప్ప మూసి తెరిచేలోగా
అది ఆదియు అంతము కనుగొన గలమా
ఏ క్షణం ఆఖరి క్షణమో
అమృతఘడియయో ఎవరికి తెలుసును..
నేడు నీది నిన్న నీది కానే కాదు గా,
రేపు తెలియనే తెలియదు గా ,ఎందుకో ఈ క్షణమే బాధ, భయం ,ఆందోళన, కుట్ర అసూయ, ద్వేషాలు.
ముందుకు సాగుతూ సాగిస్తూ సాగిపోతూ ఉండాలిగా ఇదేగా జీవిత సత్యం.
మౌనం పలికే వేళ,
అలజడి చేయు ఊహలు,
చిట పట చిందులు వేస్తూ,
మైమరిపించే ఆనందం....
© saధना🖌️
#myopinion
#rangbarse
