STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Thriller

మొగిలి పరిమళం అతని కౌగిలి

మొగిలి పరిమళం అతని కౌగిలి

1 min
502

అరవిరిసిన అందం అతనిది

అరుణ కాంతుల రంగు అతని సొంతం

అంబరాన్ని మించిన కనుల సోయగం 

కొండలను కరగదీసే కండల వీరుడు

తన కౌగిలిలో నలిగితే వచ్చె ఆనందం

రెట్టింపు అనుభూతికి రుచి మరిగి

అలవాటు పడిన నా వలపుకి 

అనుభవిస్తేనే పురుషుని లోగిలిలో 

ప్రకృతి ఒదిగిన మొగిలి పువ్వుల 

పరిమళ పరమార్థం తెలుస్తుంది


నా గాజుల చప్పుడు సెలయేటి గలగలతో

ప్రణయ గీతాలను ప్రవహింప జేస్తున్నాయి 

నా చెవుల కమ్మలు చల్లని సమీరంతో

సరసకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి

నా ముక్కు పుడుక నీ తీయ్యని ముద్దు కోసం 

పక్కకు తప్పుకుంటా నంటున్నది

నా నవ్వులు మల్లేల వానలు కురియగా

నాపై నా దేహమందు నీకు కోరిక మొలకేత్తలేదా?

నా చేతుల్లో గోరంటాకు నీతో ఈ రాత్రిని 

ఎర్రగా పండించుకోవాలంటున్నది

నా అమావాస్య కురుల విరులు తెల్లని మబ్బులో 

తేలియాడే మత్తులో నన్ను ముంచెస్తూన్నాయి

నా కళ్ళు మధురంగా నీ మనసును కెలుకుతుంటే

నన్నెత్తుకు ముద్దాడాలనిపించదా?


నీ దేహమునకు నా మనసు పరితపించగా

నీ బాహువులలో నా దేహము ఉయాలలుగాగ

నీ అధర చుంబముకు నేను మధువును చిందించగా

నీ వాడి చూపులకు నేను పరవశము తప్పిపోగా

నీ శ్వాసకు నేను వేడి శ్వాసగా మారిపోగా

నీ ముని వేళ్ళ స్పర్శలకు నా తనువు తరించగా

నీ వక్షమునకు నా కుచములు తలలు వంచగా...!


అబ్బా! నా నిట్టూర్పులు

నా తనువు వేడి బాధ ఎంటో ....

రాత్రిళ్ళు నిరీక్షణతో ఎదురు చూస్తూ

చంద్రుని కాంతిలో విచ్చుకునే కలువ

పూవ్వులకు తెలుసు .....

నీ మోహన్నీ చల్లార్చాలంటే నేను

ఎన్ని రాత్రులు జాబిలులై ఉదయించాలో....!

ప్రతి అర్ధరాత్రి నీతో యుద్ధం 

అంతం లేని ఆరంభమే కావాలి

అలసట ఎరుగని సాంగత్యంలో

అమరత్వం పొందాలి మన దాంపత్యం!



Rate this content
Log in

Similar telugu poem from Romance