Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller

4.5  

Eevani Ravisankara Sarma

Thriller

ఓ పాట పాడనా !

ఓ పాట పాడనా !

1 min
310


నీకోసం ఓ తియ్యనిపాట పాడనా !

మన ప్రేమకు భాష్యం అందులో తెలుపనా !

పురివిప్పే నెమలిలా ఆడనా !

ఒకరికి ఒకరైతే ముద్దని అందంగా చూపనా !


నీకోసం ఓ తియ్యనిపాటే పాడనా !

మనప్రేమకు భాష్యం అందులో తెలుపనా !

పురివిప్పే నెమలిలా ఆడనా !

ఒకరికి ఒకరైతే ముద్దని అందంగా చూపనా !


పువ్వంటే నవ్వని , నువ్వంటే ప్రేమని

నీతోనే నేనని , లేకుంటే అది నటన అని

తెలిసింది ఒకనాడు .

ఆ సంగతే సత్యమై నిలిచింది ఈనాడు .

వెలుగే చైతన్యమని , చీకటిలో నాకు నేనే తెలియనని

నీదే స్నేహమని , నీతోనే జీవితమని

గుర్తించాను ఆనాడు .

ఆనందం నిత్యమైంది అందుకే మరునాడు .


నీకోసం ఓ తియ్యనిపాట పాడనా !

మనప్రేమకు భాష్యం అందులో తెలుపనా !

పురివిప్పే నెమలిలా ఆడనా !

ఒకరికి ఒకరైతే ముద్దని అందంగా చూపనా !


నీ ప్రతిమాటా జ్ఞాపకము .

నడిచిన అడుగడుగు పెంచెను నాలో నమ్మకము .

అలలే కాదా సంద్రము .

గుండెసవ్వడి నీవయ్యాకే నాకు భాగ్యము .

నాలో ఉండిపోవా ఎప్పటికీ !

నా ప్రేమను ఇస్తా బహుమతిగా కలలో కోరినప్పటికీ !


ఓ ప్రేమా ! నా ప్రాణమా ! హృదయంలో స్థానమా !

నీకోసం ఒక మధురమైన పాటను పాడనా !

పురివిప్పే మయూరమై నాట్యం చేయనా !

నీవే నేనని , నేనే నీవనీ సరిగమలతో తెలుపనా !

మనప్రేమకు సాక్ష్యం పాటలో ఉందని ,

మనసే మమకారంతో వెలువరించిందనీ చెప్పనా !

ఓ నేస్తమా ! వినవా ! నీ ప్రేమను నాపై కురిపించవా !



Rate this content
Log in

Similar telugu poem from Thriller