దేనికి తల వంచకు
దేనికి తల వంచకు
గాయం నీకో పాఠం
"పిడుగులు పడినా....మెరుపులు మెరిసినా...
ఆకాశం అదురునా...భూమాత బెదురునా...."
"అడవిని కొట్టేసినా... నిప్పుని రాజేసినా...
చెట్లు గొడ్డలికి వణుకునా.. నిప్పుకి భయపడునా..."
"హుదూద్ ముంచేసినా... తితిలి తిరగేసినా...
రైతుని గెలుచునా.. తన శక్తిని ఓడించునా..."
"బుల్లెట్లు తగిలినా...రక్తం పారినా...
సైన్యం చెదురునా... రోషం
తగ్గునా...."
"గెలిచే ప్రయత్నంలో తగిలే గాయాలు ఓ లెక్కనా...
నీ ఆత్మవిశ్వాసాన్ని అవి తగ్గించునా.."
తెగించి పోరాడితే గెలుపే నీ దరి చేరుతుంది..
౼ కిషోర్ శమళ్ల