దేనికి నిరాశపడకు
దేనికి నిరాశపడకు
రెండు చేతులిచ్చాడు దేవుడు ఎంత బరువైనా మోయమని.
రెండు కాళ్ళు ఇచ్చాడు మోసే చేతులకి సాయం చేయమని.
కండలు గట్టిపడుతున్నాయి నీకు కష్టం తెలియొద్దని.
చర్మం చెమటను చిందిస్తుంది. అంటే నీ కష్టాన్ని గుర్తిస్తుంది.
మెదడు నీకోసమే ఎప్పుడు ఆలోచిస్తుంది నువ్వు గొప్పోడివి కావాలని
కళ్ళు నీ గెలుపుని చూడాలని అనుకుంటున్నాయి.
చెవులు నీకోసం కొట్టే చప్పట్లు, ఈలలు, పది మంది మాట్లాడుకునే మంచి మాటలు వినాలని అనుకుంటున్నాయి.
నీకోసం ఇంత మంది ఆలోచిస్తుంటే..
నీకు సాయం చేస్తుంటే..
సాయం చెయ్యని స్వార్ధపు సమాజం మాటలు ఎందుకు విని నిరాశ పడుతున్నావు.
నీ రక్తం ఉడుకు నీకు తెలియట్లేదా??
నీ ఊపిరి గాలికి ఉన్న శక్తి నీకు అర్ధం కావట్లేదా?
బద్ధకం అనే సంకెళ్లు తెంచి ఓటమి అనే శత్రువు పైన యుద్ధం చెయ్.
గ
ెలుపు కోసమే పోరాడు, ఓడిపోతే నీ వల్ల కాదు అనే మాటలు నిన్ను వేదిస్తాయి.
సమాజం మాట్లాడుకోడానికి నీ సక్సెస్ ఒక ఉదాహరణ కావాలి.
నీ గెలుపు కోసం నేను ఎదురు చూస్తున్నా...!
ఇట్లు
నీ మనసు
ఎప్పుడు నీకోసం పరిగెడుతూనే వుంటాను.