STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తీర్చాలిర

తీర్చాలిర

1 min
5



నీ స్వర్గం నీకిచ్చిన..అమ్మరుణం తీర్చాలిర..!
మరణాన్నే ఎదిరించిన..అమ్మరుణం తీర్చాలిర..!

నోములెన్ని నోచిందో..వ్రతాలెన్ని చేసిందో..
నిన్ను కనే వరమందిన..అమ్మరుణం తీర్చాలిర..!

ఎలా నిన్ను పెంచిపెద్ద..చేసిందో చెప్పాలా..
నిజతపస్సులో మునిగిన..అమ్మరుణం తీర్చాలిర..!

పప్పన్నం పరమాన్నం..నీకుపెట్టి మురిసిపోయి..
ఏమితినక పస్తుండిన..అమ్మరుణం తీర్చాలిర..!

నాన్న కేకలేసినపుడు..నిన్ను సమర్థించును కద..
నీ ప్రగతికి తోడుండిన..అమ్మరుణం తీర్చాలిర..!

తన సేవలు మరచినీవు..ఏమన్నా నవ్వేనా..
నినుచూస్తూ మైమరచిన..అమ్మరుణం తీర్చాలిర..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics