STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ తలపున

నీ తలపున

1 min
2


నీ తలపున ఉండిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!
నీ పాటగ మారిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!

ఏ దారెటు పోతేనేం..నీ చూపే నా దారిగ..
నీ వెలుగున కలిసిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!

అలసటకే విసుగేసెను..నిద్దురకే సిగ్గేసెను..
నీ పూజన కరిగిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!

మరపుకన్న వరమేదో..మైమరపే తోడైనది..
నీ దివ్వెగ మిగిలిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!

ఈ అవస్థ వర్ణించగ..మాటలసలు దొరకవులే..
మరిగిమరిగి ఇగిరిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!

హాయి తూచు తక్కెడెలా..ఉంటుందో ఈ జగాన..
నీ ప్రేమన తేలిపోతి..ఉత్సవమే ఇపుడంతా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics