మంచు కురిసిన సమయం
మంచు కురిసిన సమయం
మంచు కురిసింది.
మనసు విరిసింది.
ప్రకృతి పరవశించింది.
చల్లని గాలులు.
ఆకాశాన్ని కప్పేస్తాయి.
మేఘాలు మాయమైపోయాయి.
ఏ దారి కనిపించడం లేదు.
ఎటు చూసినా మంచు మేఘాలే.
చిన్న చిన్న నీటి తుంపరాలు శరీరాన్ని తాకుతున్నాయి.
ఆహ్లాదకార వాతావరణం.
మాటల్లో చెప్పలేని మధుర సంగతులు.
మంచు తుంపరాలు చెట్లలోకి చేరి
చిన్న చిన్న నీటి బొట్టులై కురుస్తుంది.
ఆమంచు వర్షంలో పువ్వులు సువాసన పరిమళిస్తున్నాయి.
ప్రకృతి ఎన్నోరకాల అందాలు దాచుకుంది
ఆది చూసి ఆస్వాదించాలి.
వచ్చి మాయమైపోయే మంచు ఏదో తెలియని
ఆనందాన్ని పంచి మెల్లి మెల్లిగా మాయమైపోయింది
ఈమంచు కురిసిన సమయం
ప్రతిరోజు గుర్తుండే మరుపురాని క్షణాలు...
