నువ్వుంటే
నువ్వుంటే
కనురెప్పలు మూతపడవు నాముందర నువ్వుంటే
గుండెసడులు సడిచేయవు నాముందర నువ్వుంటే
భగవంతుడు ఎదురునిలిచి వరాలెన్నొ కురిపించిన
దేవుడైన కానరాడు నాముందర నువ్వుంటే
పెళ్లుబికిన ఆనందం పరవశించి పోతుందీ
కన్నీళ్లూ రాలిపోవు నాముందర నువ్వుంటే
గుండెసజులు పెదవంచున ప్రాకుతుంటె ఆపలేను
పెదవి వణుకులాగిపోవు నాముందర నువ్వుంటే
ప్రేమఉరికి సాగాలని అడుగువేయ తలచానూ
నాపయనం సాగిపోదు నాముందర నువ్వుంటే
