STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కల

కల

1 min
7

కరిగి పోయే కల  
కరిగి పోయే మంచు 
కన్నీటి అలలలో కరిగి పోయే 
హృదయ భారం 
ఉరుముల మెరుపుల గర్జనలు
కరిగి పోయే వర్షం కురిసి వెలిసాక 
పువ్వునై విరిసి సువాసలు 
వెదజల్లుతూ తేనెల మకరందాలు
చిందించాలనే  కడలిలోని  
తరంగమై ఎగసి నీ పాదాలను 
తడిపి ముద్దాడి పావనమౌవ్వాలనే 
సంకెళ్ళు తెంచుకున్న మనసులా  
నీ తలపుల్లో గమ్యాన్ని వెదుకుతూ
ఆవలికి చేరాలనే భ్రమయా 
పంజరాన్ని విడిచి రెక్కలు విప్పి 
ఎగిరిపోయే హృదయమా 
పరుగెక్కడికే మనసాఅలసి సొలసి 
చతికిలపడకే కలయా భ్రమయా 
కన్నీరా ఇంకిపోయే కన్న కలలన్నీ 
మంచల్లే కరిగిపోయేభ్రమగా 
సాగి పోతోందీ జీవితం
అన్నీ పొందామనే భ్రమలో 
కాలం సాగుతోందీఆశలన్నీ
భ్రమ  ఎక్కడకీ పరుగు ఎంత
పరుగెత్తి అలసి పోతున్నా 
ఏమీ లేదు భ్రమలో సాగుతూ
శూన్యంలో కొట్టుమిట్టాడుతూ 
                  
             


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics