అమ్మాయి
అమ్మాయి
ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి
ఇంటి ముందు ముగ్గుతో
శుభోదయం పలుకుతుంది.
ఆరడుగుల చీర అమ్మాయికి అందం తీసుకొస్తుంది.
ఆ కన్నులకు కటుక దిద్దుకుంది.
నుదుటన బొట్టుతో మెరిసింది.
చెవులకు ఝుంకిలు.
చేతుల గాజులు గల గలాలు.
పాదాలకు పట్టీల చప్పుళ్ళు.
వాలు జడను పువ్వులతో అల్లింది.
నడిచివస్తే కుందనపు బొమ్మలా ఉంది.
సంప్రదాయానికి విలువ నిస్తుంది.
మాటలు తేనె లోలుకు ముఠాలు.
గౌరవ మర్యాదలకు నిదర్శనం.
నిండైన మనస్సు ఆమెది.
వ్యక్తిత్వమే ఆమె ఆభరణం.
వేలకొద్ది మంచి గుణం ఆమె సొంతం.
శాంతనికి శాంతం_కోపానికి కోపం.
మంచికి విలువ నిస్తుంది.
కత్తిపట్టి యుద్ధం చేయగలదు.
గెలిపిస్తుంది అందరిని.
రెండుచేతులు ఎత్తి మొక్కే తెలుగుదనమే
తెలుగమ్మాయి..
