అంటిముట్టనట్లు
అంటిముట్టనట్లు
నేడు మనుషుల మధ్య ఎన్నో అడ్డుగోడలు
మనసుల మధ్య ఎన్నో తెలియని దూరాలు
పక్క పక్కనే ఉన్నా లేదు ఎలాంటి పలకరింపు
ఎందుకో అందరు అంటిముట్టనట్టు బ్రతుకడం
నేటి మానవ సంబంధాలు అవసరాల మేరకే
ఆప్యాయత, అనురాగాలు అవకాశాల వరకే
ఎవరైనా కలిసిన క్షణం కూడా కృత్రిమం
ఇంటా, బయటా కలవని మనసుల పంతం
కేవలం మాటల్లో మాత్రమే మమతలెన్నో
అదే చేతల్లో మాత్రం వేసుకునే లెక్కలెన్నో
మనుషుల నవ్వుల్లోనూ నాటకం కనిపిస్తోంది
నిజానికి నిజమైన మనసు అనేది దొరకకుంది
మన మధ్య ఒక రక్తబంధం ఉన్నా దూరమే
మనసు బంధం వైపు మరీ మరింత దూరమే
కాకుంటే ఫోన్‌లో దగ్గరగా కనిపిస్తూ నటన
జీవితంలో అంటిముట్టనట్టు బ్రతికే ఘటన
ప్రతి సుఖంలో చుట్టూ గుమిగూడే జనం
కానీ కష్టాల్లో ఎవరూ రాని ఒంటరితనం
విలువైన బంధం అర్థమయ్యేలోపే అది ఆవిరి
కాలం చేతులు దాటిపోయాక పోయేది ఊపిరి
ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి ఆలోచించాలి
తోటి మనిషిని మనిషిగా తప్పక చూడాలి
ఈగోలు, అహంకారాల గోడలు కూల్చాలి
ఆప్యాయతతో మనిషి మనిషిగా దగ్గరవ్వాలి !!
