చెప్పును
చెప్పును
ప్రేమించే చిరుగాలిని..నేనెలాగ బంధించను..!?
వేదించే ఆ గాలిని..ఆగాలని ఏం చెప్పను..!?
మదిలోయల విరబూసిన..పూలతోట తనదేగా..
ఉడికించే ఆ గాలిని..చేరమంటు ఏం కోరను..!?
మాటాడక చుట్టేస్తూ..అలజడేల సృష్టించునొ..
కవ్వించే ఆ గాలిని..వద్దనెలా వారించను..!?
జన్మలుగా సయ్యాటల..ఊయలతో అనుబంధం..
కలహించే ఆ గాలిని..ఇపుడెలగా మురిపించను..!?
ప్రవహించే గుండెతడిని..పాటలోకి నింపేయును..
దీవించే ఆ గాలిని..గ్రోలకెలా వదిలేయను..!?
వేనవేల రాగాలను..దిమ్మరించు జాణ తనే..
ఊరించే ఆ గాలిని..ఏ తీరుగ కట్టేయను..
