STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ముద్దంటా

ముద్దంటా

1 min
1


నీ తోటన ఆడుకునే..నా మనసే ముద్దంటా..!
నీ పేరే తలచుకునే..నా మనసే ముద్దంటా..!

ఈ క్షణమే నిజమనేది..రుజువైనది నీ దయతో..
నన్నునేను చెక్కుకునే..నా మనసే ముద్దంటా..!

కత్తి మీద నడకేగా.. అనుక్షణం అడుగడుగున..
చిన్ని ఆశ నిలుపుకునే..నా మనసే ముద్దంటా..!

నీ మౌనం ప్రేయసిగా..అల్లుకుంది ఈ గుండెను.. 
లేఖలలో నింపుకునే..నా మనసే ముద్దంటా..!

నా క్షేమం కోరుకునే..నీకన్నా నేస్తమెవరు..
నీ ప్రేమను పాడుకునే..నా మనసే ముద్దంటా..!

నిత్యమైన నీ ప్రేమను..ఇంతంటూ చూపనెలా..
ప్రాణంగా చూసుకునే..నా మనసే ముద్దంటా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics