STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

బాగున్నది

బాగున్నది

1 min
1



నీ వలపుల గాలి నన్ను..బంధించుట బాగున్నది..!
నీ అడుగుల చప్పుడిలా..ఉడికించుట బాగున్నది..!

ఎంతదూర మొచ్చానో..నా కాళ్ళకు తెలియలేదు..
నీ కోసం ఈ కళ్ళను..వెతికించుట బాగున్నది..!

నా ఆశల చిట్టాలేం..పెట్టనులే నీ ఎదురుగ..
ప్రేమనదే నా పాటగ..ప్రవహించుట బాగున్నది..!

ఏకబిగిని మాటలన్ని..అచ్చెరువున మునిగెనే..
మౌనం నీ చూపులలో..పొంగించుట బాగున్నది..!

గుండె ఎలా తెగిపడెనో..చెప్పడమే కుదరదులే..
నీనవ్వుల మెఱుపొక్కటి..సంధించుట బాగున్నది..!

నీ రూపం అపురూపం..అందనిదే ఈ‌ కళ్ళకు..
రుచులవీణ వాసనలను..ఓడించుట బాగున్నది..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics