జాడ
జాడ
చిలుకా పలుకవేలనే..ఏదీ అతని జాడ..!?
నోరే విప్పవేలనే..ఏదీ అతని జాడ..!?
ఎందుకంత దిగాలుగా..కనిపించెనా అసలు..
కన్నా తెలుపవేలనే..ఏదీ అతని జాడ..!?
ఎలా తిరిగి వచ్చినావు..తన మాట తేకనే..
ఓరీ చెప్పవేలనే..ఏదీ అతని జాడ..!?
నా లేఖను ఇచ్చావా..కలిశాడా లేదా..
ఏమీ ఉలకవేలనే..ఏదీ అతని జాడ..!?
నా ఆశల రెక్కల్లో..బలం నింపమంటా..
చప్పుడు చేయవేలనే..ఏదీ అతని జాడ..!?
రాత్రులెన్ని గడిచాయో..మలగలేదు కనులు..
ఊపిరి నిలుపవేలనే..ఏదీ అతని జాడ..!?
