STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నటనాలయ

నటనాలయ

1 min
3



నటనాలయ పూలవీణ..దొరికినట్లు ఉందిప్పుడు..!
మౌనరాగ మధుశాలన..నిలిపినట్లు ఉందిప్పుడు..!

మనసు పాట నాలకించు..కోమలాంగి తానేలే..
చూపలేని ప్రేమలేఖ..ఇచ్చినట్లు ఉందిప్పుడు..!

ఆలోచన చేయాల్సిన..యాతనలే తప్పించెను..
నా కథనే వింత మలుపు..తిప్పినట్లు ఉందిప్పుడు..!

ఊహ కందనంత హాయి..ఊరించే సోయగమది..
మదిలోయల తీపి నదిగ..మారినట్లు ఉందిప్పుడు..!

భావగగన వీధులలో..సంచరించు మోహనాంగి..
అక్షరాల వెన్నపూస..పెట్టినట్లు ఉందిప్పుడు..!

ఏ కుంచెకు లొంగని చెలి..రూపునెలా చూపాలిక..
వర్ణనలకు అందనంత..నవ్వినట్లు ఉందిప్పుడు..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics