నాన్న
నాన్న




ఎప్పుడు గంభీరంగా కనిపిస్తాడు కానీ,
అడగకముందే అన్ని తెచ్చి ఇస్తాడు,
అయినా నాన్న అంటే ఏదో తెలియని భయం.
పది రూపాయలు పిల్లలకు దాచి పెట్టానికి పది మైళ్ళు అయినా ఇంటికి నడుచుకుంటూ వస్తాడు నాన్న.
అమ్మ నాన్నకి ఇష్ట్మని ఉన్న ఒక్క లడ్డు పెడుతుంది
అయినా తినకుండా పిల్లలకి ఇస్తాడు నాన్న ,
జీవితంలో పరిగెత్తే ప్రయత్నం లో కిందపడకుండా
పిల్లల చేయి పట్టుకొని నడిపిస్తునే ఉంటాడు నాన్న,
కుటుంబం సంతోషంగా ఉండటానికి
నేను ఉన్నాను అన్న నమ్మకం ఇస్తాడు నాన్న,
ఎంత కష్టమైన ఇష్టంగా పిల్లలకీ ఏ ఇబ్బందీ రానివ్వకుండా నవ్వుతూ బరిస్తాడు నాన్న.
బాధ్యత, క్రమశిక్షణ, పద్దతీ, త్యాగం నాన్న.