ఆ స్వప్నం
ఆ స్వప్నం
ప౹౹
వరించి వచ్చి ఆ స్వప్నము సందడి చేసింది
సవరించిన మదిలో ఒక సంతకమే చేసింది ౹2౹
చ౹౹
అరే గుండెలోన గుచ్చిందే రాత్రి వచ్చిన కల
మరి మంటనే పెంచెనే ఆ వెన్నెల నవ హేల ౹2౹
కల అంటే కల కాదులే ఓపన్నీటి పలకరింపే
అలలాగ మనసునే కప్పే మైకం పులకరింపే ౹ప౹
చ౹౹
మనసుకు నచ్చిన నెచ్చలి మత్తునే పెంచగ
సొగసుతో సోయుగమే కలసి వలపే పంచగ ౹2౹
కలసి వచ్చిన కాలమే కలనే నిజమే చేయగ
నడచి వచ్చిన నవహాసం మరి వరించేయగ ౹ప౹
చ౹౹
ఏర్పాటు జరిగేనా ఎదనూ జత చేసేందుకు
తోడ్పాటు ఉండేనా తొలిప్రేమ గెలిచేందుకు ౹2౹
కలతనే తొలగింప కలను నిజం చేయు వేళే
కొలతలేని ప్రేమలో కోరిక సాధించుట ఓకళే ౹ప౹