STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

సినిమా పాటలు నాడు -నేడు.

సినిమా పాటలు నాడు -నేడు.

1 min
297


-------------------------------

(పద్య మాలిక )


నాడు :


తీయ దనమును గురిపించు తెలుగు పాట

మనసు నుర్రూత లూగించె ఘనత మించ 

నాటి కవులాహ!సాహితీ

 క'వన' మందు

నిత్య కృషికు లైరట భావ నిష్ఠతోడ.

గాయకీగాయకులు రాగ గమక ఝరుల 

సుధలు మేళవింపగ

వినసొంపు గాను

పఱుగు పెట్టుచు పాటలు పరిమళించ

పాత పాటల పెట్టెలో నూతనముగ

పరిఢవిల్లెను పూదోట విరుల సొబగు

నాటి పాటలు జాబిల్లి నవ్వు వోలె

పులకరింతలు కలిగించి వెలుగునింప

మధుర గానలహరి లోన మనుజు లెల్ల

సోలి పోయిరి తేనెల సోనలందు.


నేడు :


నేటి చిత్రంపు పాటలు నీచగతిని 

గురుతురానట్టి పదములు గోలపెంచ

గార్దభంబులన్ జతగూడి కాకు లిపుడు

గొంతు విప్పిన చందము వింత గొలుపు 

గరగరల్ నిండి పోయిన గాన గరళ 

జలధి ముంచగా లోకులు జడిసి పోవ 

తెలుగు చిత్రాల పాటకుతెగులు పట్టె.

---------------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics