నవ్వుతూ బ్రతకాలి...
నవ్వుతూ బ్రతకాలి...
నవ్వుతూ కనిపిస్తే
బాధలు లేవనికాదు
కలిసిపోతూ నవ్విస్తే
బాధ్యతలు వదిలేసినట్టూ కాదు
ఒంటరిగా ప్రయాణంచేస్తే
బజారునపడ్డట్టు కాదు
పనిమీద పలువురితో మాట్లాడితే
బరితెగించి మసలడమూకాదు
అన్నిరంగులూ పులిమి
భూతద్దంలో చూసిప్రశ్నిస్తే
సమాధానం చెప్పితీరాల్సిన పనీలేదు
నీవెంటో నీకుతెలిస్తే
నిరూపించుకోవాల్సిన అవసరంలేదు
అండగా వున్నాళ్లు స్నేహితులయితే
నమ్మనివాళ్లు శ్రేయోభిలాషులనుకుంటే సరి...
...సిరి✍️
