Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శ్రీహరి స్మరణ

శ్రీహరి స్మరణ

1 min
288



1.యదుకులవంశ కిశోరుని

సదమలహృది భక్తి దల్చి సారెకు కొలువన్

మదమన్నది తొలగును సం

ప్రదమగు మార్గము దొరుకును

పరములభించున్./


2. ఘనమగు వేలుపు శ్రీహరి

మన వెంట చరించు నెప్డు మనలో నొకడై

కనుగొన గలిగిన చాలును 

గుణరహితుడు దరికిచేరి కూరిమి చూపున్ /



3.  సుగుణమ్ములప్రోవు హరిని 

నిగమాంత నుతుని భజింప నియమముతోడన్

సుగతిని పొందుట తధ్యము

ఖగపతి పదరేణువొకటి కాచును మనలన్./



4. సతతము హరినే దల్చగ

వెతలన్నియు తీరు మనకు విభవము కల్గున్

ధృతి నిచ్చెడివాడే స

ద్గతినొందెడి దారిచూపు గమనిక తోడన్/


5. కరుణను జిలికెడి కృష్ణుని

వరయుగపురుషుని నిరతము భక్తిగ వేడన్

బరుగున వచ్చును తోడుగ

పరమాత్మ చెలిమియె పరమ పథమును జూపున్ /


6. హృష్టిగ కొల్చిన శౌరిని 

కష్టములెల్ల తొలగించు కరుణాత్ముండై

భ్రష్టుల దునుముచు సరగున

శిష్టుల రక్షించు నెప్డు శ్రీకరమొప్పన్/



Rate this content
Log in