STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మాతృమూర్తి

మాతృమూర్తి

1 min
319

కన్న తల్లి యన్న కరుణామూర్తియే 

ధరణి లోన నిలిచిన దైవ శక్తి.

పుడమియందున్న ప్రతి జీవిలోను

మాతృ ప్రేమ పొంగి పొరలు చుండు

పిల్లలెందరున్న భారమని యెంచక

సాకుచుండును తల్లి స్తన్యమిడుచు .

తల్లి ఋణము తీర్చి తనయులు మెలుగుచు

తల్లి సేవ చేసి తనరు చుండ 

తల్లి గుండె నిండి చల్లని దీవెనల వర్షము కురిపించు నెప్పుడు.

మమ కారమును చూపి మంచి బోధించు తల్లిని

దైవరూప మనుచు తల్చ వలయు.

ధన సంపదలు ధాన్య రాసులును

భోగ భాగ్యములు పెంపుగా వున్నట్టి

గృహము నందు తల్లికి విలువ నీయక దూషింప 

నిత్య దారిద్ర్యమే నిలువునా ముంచును.

తల్లి మాట వినెడి బిడ్డలే బిడ్డలు.

తల్లి కొంగు నీడయే రక్ష రక్ష 

పెద్దరికము తోడ పెన్నిధి వోలె తల్లి వున్న యిల్లు

సౌభాగ్యములకు నెలవు.


Rate this content
Log in

Similar telugu poem from Classics